తిరుపతి(Tirupati) జనసేన నేత కిరణ్ రాయల్(Kiran Royal)పై ఆరోపణలు చేసిన మహిళ అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో లక్ష్మీ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమెను రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు (Jaipur police) అరెస్ట్ చేసి ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆన్‌లైన్ మోసం కేసులో లక్ష్మీని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ.. కిరణ్ రాయల్ చేయించిన దౌర్జన్యాలలో ఒకటి అని, అతడి దౌర్జన్యాలకు అంతు లేదని వ్యాఖ్యానించారు.
కాగా ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర వివాదాలపై కిరణ్ రాయల్‌పై లక్ష్మీ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు మీడియా సమావేశంలో ఆమె మట్లాడుతూ.. కిరణ్ మాయమాటలకు తాను మోసపోయానని వాపోయారు. తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నట్లు వెల్లడించారు. తనకు ప్రాణహాని ఉందని.. ఎక్కడ ఆడపడుచులకు కష్టం వచ్చినా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ తనకు సహాయం చేయాలని కోరారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మహిళ ఆరోపణలతో పార్టీ వ్యవహారాలకు కిరణ్ రాయల్ దూరంగా ఉండాలని జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.