Homeఆంధ్రప్రదేశ్Viral: పవన్ కల్యాణ్ అన్నా.. నన్ను కాపాడండి: మస్కట్‌ నుండి తెలుగు మహిళ ఆర్తనాదాలు!

Viral: పవన్ కల్యాణ్ అన్నా.. నన్ను కాపాడండి: మస్కట్‌ నుండి తెలుగు మహిళ ఆర్తనాదాలు!

Muscat woman: బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన ఓ మహిళ ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతోంది. అప్పులు తీర్చి పిల్లలను పోషించుకోవాలనే ఆశతో విదేశానికి వెళ్తే.. అక్కడ యజమాని పెడుతున్న చిత్రహింసలతో ఆ నరకం నుంచి తనను కాపాడాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ అనే మహిళ మస్కట్‌లో ఎదుర్కొంటున్న వేధింపుల ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

- Advertisement -

బంధీగా మార్చి చిత్రహింసలు: కుటుంబ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం షానల్.. ఓ ఏజెంట్ ద్వారా మస్కట్ వెళ్లారు. అయితే అక్కడ ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక యజమాని ఆమెను ఒక గదిలో బంధించి కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా నిత్యం దారుణంగా కొడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.యజమానికి తెలియకుండా బాత్‌రూమ్‌లో రహస్యంగా రికార్డు చేసిన ఓ వీడియోను షానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆమె దీనస్థితి కళ్ళకు కడుతోంది.”సేఠ్‌కు తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఇక్కడ పడుతున్న దెబ్బలకు ఫిట్స్ వచ్చి చనిపోయేలా ఉన్నాను. నాకేమైనా జరిగితే నా ముగ్గురు బిడ్డలు దిక్కులేని వారవుతారు. ఎలాగైనా నన్ను కాపాడి స్వదేశానికి రప్పించండి” అంటూ ఆమె హృదయవిదారకంగా వేడుకున్నారు.

పవన్ కల్యాణ్‌ను వేడుకున్న షానల్‌: తనను రక్షించగలిగేది కేవలం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రమేనని ఆమె ఆ వీడియోలో అన్నారు. ఆయన చొరవ తీసుకుని తనను ఈ నరకం నుంచి విముక్తి ప్రసాదించాలని షానల్ కన్నీరుమున్నీరుగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో.. ప్రభుత్వం స్పందించి ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చాలని స్థానికులు, నెటిజన్లు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News