World Heart Day Medicover Visakha Beach: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న వ్యాధి ‘గుండెపోటు’. నిండా పాతికేళ్లు లేని వారు కూడా హార్ట్ ఎటాక్‌తో ఇటీవల మరణించిన సందర్భాలు చూస్తున్నాం. ఉరుకులు, పరుగుల జీవితం, మారుతున్న ఆహారపుటలవాట్లు, జీవనశైలి.. జన జీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘గుండె’ను పదిలంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలపై నిత్యం నిపుణులు సలహాలు ఇస్తూనే ఉన్నారు. కాగా, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విశాఖ రోడ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

‘వరల్డ్ హార్ట్ డే’ సందర్భంగా ‘మెడికవర్’ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో.. సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ నేతృత్వంలో విశాఖ బీచ్ రోడ్‌లో వైఎంసీఏ వాక్‌థాన్ నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది పాల్గొన్నారు. ఉత్సాహ భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో వాక్‌థాన్ మధ్యలో యువత, వైద్యులు కలిసి నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గుండె పదిలం అంటూ వైద్యులు, యువత నినాదాలు చేశారు.
వృద్ధులతో పాటు యువతలో కూడా గుండె జబ్బుల ముప్పు వేగంగా పెరుగుతోందని మెడికవర్ వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. డైలీ ఎక్సర్‌సైజ్, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ, ఆరోగ్యకర జీవనశైలిని అవలంబించడం ద్వారా గుండె వ్యాధుల్ని నివారించవచ్చని సూచించారు. అంతేకాకుండా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం పేరిట రూ. 2999, రూ.4999 వేర్వేరు ప్యాకేజీల్ని ప్రకటించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్యులు డాక్టర్ ఎ. సురేష్, రంగనాయకులు, శ్రీకర్ సమీరనందన్, అశ్విన్ కుమార్ పాండా, సీహెచ్‌ఎన్ రాజు, డాక్టర్ శివ పాల్గొన్నారు.


