Homeఆంధ్రప్రదేశ్Visakhapatnam: విమ్స్ లో ఘనంగా ప్రపంచ ట్రామా దినోత్సవం

Visakhapatnam: విమ్స్ లో ఘనంగా ప్రపంచ ట్రామా దినోత్సవం

విశాఖపట్నం (తెలుగు ప్రభ): ప్రపంచ ట్రామా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో (విమ్స్)లో ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ వి. మన్మధరావు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. ‘ఒక్క ఫోన్ కాల్..ఒక అమూల్యమైన ప్రాణానికి రక్షణ’.. ప్రమాద బాధితులకు అండగా నిలుద్దాం..ప్రాణాల్ని కాపాడుదాం’ నినాదంతో అందరికీ అవగాహన కల్పించారు.

- Advertisement -

రోడ్డు ప్రమాదాలు, ఎత్తు నుంచి పడిపోవడం, పని ప్రదేశాల్లో ప్రమాదాల వల్ల కలిగే గాయాలపై అవగాహన కల్పించడం, ప్రమాదాల నివారణ, క్షతగాత్రులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని మన్మధరావు తెలిపారు. ‘నేను రోడ్డు భద్రతా నియమాల్ని పాటిస్తాను, ప్రమాద బాధితుల పట్ల నిర్లక్ష్యం చేయను, అత్యవసర పరిస్థితుల్లో 108కు కాల్ చేస్తాను’ అని అందరితోనూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మిన్స్ట్రేటర్ డాక్టర్ మనోజ్ కుమార్, 108 సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News