Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Yagangi: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Yagangi: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

కోటి రూపాయల నిధులతో పనులు

బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయ భవనాలను, సిసి రోడ్లను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి యాగంటి పల్లె గ్రామానికి చేరుకోగానే యాగంటి పల్లె గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బండి బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ యాగంటి పల్లి గ్రామంలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేయడమే కాకుండా నేడు ప్రారంభించామని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఒక కోటి 40 లక్షల రూపాయలతో నాడు-నేడు ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వైయస్సార్ ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు కళ్ళ లాంటివి అని చెప్పారు. వైయస్సార్ ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందిస్తుంటే చంద్రబాబు నాయుడు లోకేష్ లు ఏదో ఆంధ్ర ప్రదేశ్ మరో శ్రీలంక మాదిరిగా మారిపోతుందని తన పచ్చ మీడియా ద్వారా ప్రజలకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అదే చంద్రబాబు నాయుడు మహానాడు సభలో ఏవైతే జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు పక్క రాష్ట్రాల్లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి తన ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తే అదే తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారని, మరి వైయస్సార్ పార్టీ సంక్షేమ పథకాలు అందిస్తే శ్రీలంక అదే తెలుగుదేశం పార్టీ అదే సంక్షేమ పథకాలు అందిస్తే అభివృద్దా అని ఎద్దేవా చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తాటతీస్తా అధికారం వస్తే ఇండ్లలో నుంచి తీసుకువచ్చి కొడతా లాంటి పదాలు ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలే కాదని మీకు ప్రజల అధికారం ఇస్తే మమ్మల్ని కొట్టగలుగుతావేమో కానీ అదే ఇప్పుడు అధికారంలో ఉన్న మేము నిన్ను ఏమైనా చేయగలమని చెప్పారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు కాటసాని తిరుపాల్ రెడ్డి, వైయస్సార్ పార్టీ మైనారిటీ నాయకులు అబ్దుల్ ఫైజ్, అత్తర్ జాహీద్ హుస్సేన్, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు దొనపాటి యాగంటి రెడ్డి, కంకర రామచంద్ర రెడ్డి, బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సన్నల జనార్దన్ రెడ్డి, యాగంటి పల్లె గ్రామ సర్పంచ్ బండి వరలక్ష్మి, ఎంపీటీసీ మారం లక్ష్మి, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైయస్సార్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News