చంద్రబాబు, రజనీకాంత్ తోడు దొంగలేనంటూ జోగి రమేష్ అన్నారు. అందుకే బాబుపై రజనీకాంత్ పొగడ్తలని, ఎన్టీఆర్‌ను వీళ్లే చంపి దండలేసి దండం పెడతారా? అంటూ రమేష్ మండిపడ్డారు. ఒక వెన్నుపోటుదారునికి మరో వెన్నుపోటు దారుడు మద్దతా..? వెన్నుపోటుదారులంతా ఒకే వేదికను పంచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒక క్రిమినల్..ఆయన జీవితమే ఒక రక్తచరిత్ర అన్న వైసీపీ నేతలు, కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు భారతరత్న ఎందుకు ఇప్పించలేకపోయావ్..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ మరణించిన 27 ఏళ్ల తర్వాత స్మారక చిహ్నం గుర్తొచ్చిందా..? అంచూ మంత్రి జోగి రమేష్ నిలదీశారు. బావతో కలిసి బాలకృష్ణ తండ్రిని పైకి పంపించాడని, చంద్రబాబు, బాలకృష్ణలు నా వారసులని ఎన్టీఆర్ ఏనాడూ చెప్పలేదనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తడిగుడ్డతో గొంతుకోసే చంద్రబాబుదే రక్తచరిత్రని, రంగా, పింగళి దశరథరామ్‌లను పొట్టపెట్టుకున్న చంద్రబాబుది రక్తచరిత్ర, ఎవరిది రక్తచరిత్రో చర్చిద్దాం రా..చంద్రబాబూ అంటూ మంత్రి జోగి రమేష్ అన్నారు.
ఎన్టీఆర్‌ను చంపేసి మళ్లీ తానే దండేయడమే చంద్రబాబు విజన్ అని, చంద్రబాబునాయుడు డ్రామాలను చూసి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కాదు..ఎన్టీఆర్‌ను చంపిన ఖూనీకోరుల సంబరాలు అని టైటిల్ సరిగ్గా సరిపోయేది 27 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో గొంతుకోసి చంపిన ఖూనీకోరులంతా ఒక వేదిక మీదకు వచ్చారన్నారు. 27 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తావా..?ఈ 27 ఏళ్ళలో 14 ఏళ్లు చంద్రబాబు సిఎంగా ఉన్నారు. కేంద్రంలో సంకీర్ణంలో ఉన్నాడనే విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానులను నియమించి కేంద్రంలో చక్రం తిప్పిన నువ్వు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించలేకపోయావా..? ఇప్పుడు శతజయంతి ఉత్సవాల్లో ఈ ఖూనీకోరులంతా కలిసి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పిస్తారట..ఎన్టీఆర్‌కు స్మారక చిహ్నం కట్టిస్తారట..ఈ నరరూప రాక్షసులు, ఈ దుర్మార్గుడైన చంద్రబాబుకు భారతరత్న ఇప్పించాలని అప్పుడు తెలియదా..? అంటూ జోగి రమేష్ అన్నారు.