బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో బనగానపల్లె మండల వైయస్సార్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికయిన జమ్మయ్య ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ కళను ప్రదర్శించారు. అందుకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జమ్మయ్యకు శాలువ కప్పి సత్కరించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన మీద నమ్మకంతో మండల సాంస్కృతిక విభాగం అధ్యక్షుడుగా నియమించడానికి సహాయ సహకారాలు అందించారన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైయస్సార్ పార్టీ విజయానికి తన వంతు సహాయ సహకారాలు అందించి 2024 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా కాటసాని రామిరెడ్డి చేసుకుంటాం అని చెప్పారు.
ఈకార్యక్రమంలో ఆటోబాబు, నంది, మురళి, ఉషేని, రాజు, శ్రీకాంత్, శివ కుమార్, బెండు ఉసేని పాల్గొన్నారు.
