YCP| వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ సలహాదారుడు ఎస్.రాజీవ్ కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి నారా లోకేష్ ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజీవ్ కృష్ణతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, వైజాగ్ ఎంపీ భరత్ కూడా ఉన్నారు.
మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు కూడా టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు లోపు ఆయన పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన రవీంద్రబాబు.. 2014లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.