Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్YCP: 'వెన్నుపోటు దినం' కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన వైసీపీ

YCP: ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన వైసీపీ

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ వైసీపీ(YCP) ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం నిర్వహణకు సిద్ధమైంది. తాడేపల్లిలోని వై‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటు దినం’ పోస్టర్‌ను ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆదిమూలపు సురేష్, అంబటి రాంబాబు, సాకే శైలజానాథ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, కుంభా రవి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దుర్మార్గమైన పాలన అందిస్తున్నారని విమర్శించారు. వైసీపీ తలపెట్టిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాల ద్వారా సీఎం చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఉండేందుకు రాష్ట్రంలో భయోత్పాత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సజ్జల పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad