YCP leader Bollapalli : ఏపీలో తాజాగా వైసీపీకి చెందిన ఓ నేత వీఆరోవ్వోను బెదిరించిన వాయిస్ క్లిప్ బయటపడింది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో, రేమిడిచర్ల ఇన్‌ఛార్జి వీఆర్వో గంధం అరుణ్ రెడ్డి పై వైసీపీ నేత, బొల్లాపల్లి మండల కన్వీనర్ కాకర్ల నారాయణరెడ్డి తీవ్రగా విమర్శలు గుప్పించి, తీవ్ర బెదిరింపులకు పాల్పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
హద్దులు దాటి మరీ…
వైకాపా నేత కాకర్ల నారాయణరెడ్డి, వీఆర్వో గంధం అరుణ్ రెడ్డికి సర్టిఫికెట్‌ను వెంటనే ఇంటికి తెచ్చి ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే, ఆయనకు పెనాల్టీగా సచివాలయానికి ఉరివేసి చంపుతానని హెచ్చరించారు. వీఆర్వో గంధం అరుణ్ రెడ్డి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. కాకర్ల వినలేదు సరికదా అసహనంతో హద్దులు దాటి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-largest-renewable-energy-skilling-drive/
సామాజిక మాధ్యమాల్లో వైరల్..
ఈ పరిణామం మొత్తం సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ వీడియో పై స్పందించిన పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రజలు.. వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


