HomeTop StoriesMAVIGUN: ‘మావిగన్‌’ ప్రతిపాదనతో కూటమి ప్రభుత్వంలో భయం మొదలైంది- సజ్జల

MAVIGUN: ‘మావిగన్‌’ ప్రతిపాదనతో కూటమి ప్రభుత్వంలో భయం మొదలైంది- సజ్జల

YCP leader Sajjala About MAVIGUN: వైఎస్సార్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ ప్రతిపాదన పట్ల కూటమి ప్రభుత్వంలో ఆందోళన మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మావిగన్ ప్రతిపాదనను మొదట్లో ట్రోల్ చేసిన కూటమి నేతలకు.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి సాధ్యాసాధ్యాలు చూసి భయం మొదలైందని విమర్శించారు. అమరావతి కోసం రూ. లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు, కేవలం రూ. 20 వేల కోట్లతో మావిగన్ ప్రాంతాన్ని అద్భుతమైన రాజధానిగా మార్చవచ్చనేది జగన్ ఆలోచన అని ఆయన వివరించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/high-court-notices-to-senior-officials-on-pending-vehicle-challans/

‘ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలని వైఎస్‌ జగన్‌ చెప్పారు. మావిగన్‌(మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు- MAVIGUN) ప్రతిపాదనపై కొన్ని రోజులుగా ట్రోల్స్‌ చేస్తున్నారు. మావిగన్‌ ప్రతిపాదనతో కూటమి ప్రభుత్వంలో భయం మొదలైంది. రూ. 20 వేల కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తి చేయొచ్చు.’ -సజ్జల

Also Read: https://teluguprabha.net/telangana/former-minister-boda-janardhan-joins-kavitha-trs-party/

మావిగన్‌ ప్రాంతానికి ఇప్పటికే ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు వంటి కనెక్టివిటీ ఉందని సజ్జల పేర్కొన్నారు. తక్కువ వ్యయంతో ప్రజల సొమ్మును ఆదా చేయవచ్చని సూచించారు. అమరావతి పేరుతో ప్రస్తుత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారని సజ్జల ఆరోపించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News