కౌతాళం మండలం ఏరిగేరి గ్రామంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసీపీ నాయకులు ఆక్రమించిన స్థలాలను ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పరిశీలించారు.. అనంతరం స్థలాలు వచ్చిన ఎరిగేరి గ్రామ ప్రజలతో కలిసి తిక్కరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం 2006 సంవత్సరంలో సర్వే నెం.253 నందు 9 ఎకరాలు 69 సెంట్లు ప్రభుత్వ భూమిని దాదాపు 300 మంది స్థలాలు లేని పేదప్రజలకు పట్టాలు ఇచ్చారు. ఏరిగేరి గ్రామంలో ఆదోనికి పోవు మెయిన్ రోడ్డులో వున్న అత్యంత విలువగల ఈ భూమిని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి , వైసీపీ ముఖ్యనాయకులు అక్రమంగా కబ్జా చేసి ప్రైవేట్ లేఔట్లు వేసి ఇళ్ల స్థలాలకు విక్రయిస్తూ రియల్ దందాకు తెరలేపారు.. మూడుసార్లు ఓట్లు వేసి గెలిపించిన ఏరిగేరి గ్రామ ప్రజలకు బాలనాగిరెడ్డి ఇస్తున్న బహుమతి ఇదేనని. మీరు ప్రభుత్వ , ప్రజల స్థలాలను ఆస్తులను అమ్ముకోండి మేము కళ్ళుకు గంతులు కట్టుకుని చూస్తూ ఉంటామని ప్రభుత్వ అధికారులు తీరు ఉందని ఎమ్మెల్యే అండగా ఉంటున్నరాని ప్రభుత్వ అధికారులను విమర్శించారు.
ఎరిగేరి గ్రామంలో 2006లో పట్టాలు వచ్చిన ప్రజలందరికీ అండగా ఉంటామని ఈ స్థలాలు ప్రజలకు ఇచ్చేంతవరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంటనే స్థలాలు లేని పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామని తిక్కారెడ్డి తెలిపారు ..ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చన్నబసప్ప , తెలుగు రైతు జిల్లా కార్యదర్శి అల్లూరి వెంకటపతి రాజు , బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు , మైనారిటీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు టిప్పు సుల్తాన్ పాల్గొన్నారు….