వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ నెల 22వ తేదీన ఉదయం 10.30 గంటలకు వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో సహా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులందరినీ కూడా ఆహ్వనించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
- Advertisement -
నిజానికి ఈ భేటీ ఈనెల 19న జరగాల్సి ఉండగా జగనే రేపు పులివెందులలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ మీటింగ్ 22కు వాయిదా పడింది.