Saturday, July 12, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: లోకేశ్‌పై జగన్ తీవ్ర విమర్శలు.. ‘పప్పు నిద్ర మేలుకో’ అంటూ..

Jagan: లోకేశ్‌పై జగన్ తీవ్ర విమర్శలు.. ‘పప్పు నిద్ర మేలుకో’ అంటూ..

YCP President Jagan: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై సెటైరికల్ విమర్శలు సంధించారు. కూటమి ప్రభుత్వంలో ఏపీలో విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారయ్యిందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యాశాఖ ఎంత దిగజారిందో చెప్పడానికి ఏపీ ఈసెట్ ఒక ఉదాహరణని అని పేర్కొన్నారు. ఏపీ ఈసెట్ ఫలితాలు వచ్చి 45 రోజులు గడుస్తున్నా ఇంకా కౌన్సెలింగ్ నిర్వహించలేదని దుయ్యబట్టారు. మరోవైపు ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం అవుతుంటే.. ఇంకా కౌన్సెలింగ్ నిర్వహించలేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఏపీ విద్యాశాఖలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. “అమాత్య ఇప్పటికైనా మేలుకో.. ఇప్పటికైనా పప్పు నిద్ర నుంచి లేచి పనులు చూసుకో” నారా లోకేష్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్స్ చేశారు.

- Advertisement -

ఏపీ ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం కొరకు పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు 34 వేల మంది పరీక్షలు రాయగా.. అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని జగన్ అన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించలేకపోవడం, వారికి సీట్లు కేటాయించకపోవడం వలన ఆ విద్యార్థులు క్లాసులు మిస్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వరమే దీనిపై స్పందించి, విద్యార్థులకు న్యాయం చేయాలని సూచించారు.

కూటమి ప్రభుత్వంపై ఇటీవల కాలంలో జగన్ మోహన్ రెడ్డి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రతీ విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని చెబుతున్నారు. తమ పాలనలో ప్రజలు ఎలాంటి ప్రయోజనాలు పొందేవారు.. కూటమి పాలనలో ఎలాంటి ప్రయోజనాలను మిస్ అవుతున్నారు అనేది వివరిస్తున్నారు. అలాగే ప్రజల్లో తమ పాలనే మెరుగ్గా ఉందనే భావనను కల్పిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం తమ పార్టీకి చెందిన నేతలపై అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపిస్తోందని చెబుతున్నారు. ఈ విధంగా తమ పార్టీ ఇంకా క్రియాశీలకంగానే ఉందని, తాము ప్రభుత్వ దారుణాలను సహించబోమని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News