అందరూ ఊహించినట్టే ఏపీ అసెంబ్లీ సమావేశాలు టెన్షన్ టెన్షన్ల మధ్య ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి, గవర్నర్ ఎస్.అబ్ధుల్ నజీర్ ప్రసంగం ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం ప్రారంభంతోనే, నిరసన వ్యక్తం చేసిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నినాదాల మధ్యే, ప్రసంగం కొనసాగిస్తున్న గవర్నర్. ‘రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నశించాలి’..‘సేవ్ డెమొక్రసీ’.. అంటూ సభలో నినాదాలు చేశారు వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
మెడలో నల్ల కండువాలతో హాజరైన వైయస్సార్సీపీ సభ్యులు..రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ.. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో నినాదాలతో, నిరసన వ్యక్తం చేసిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.