Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Yennam: పేదలకు రేషన్ కార్డులు ఇచ్చింది మేమే

Yennam: పేదలకు రేషన్ కార్డులు ఇచ్చింది మేమే

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్దేశ్యం ఇదేనా?

ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి వారికి కడుపు నిండా బువ్వపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని బోయపల్లి 16 వ వార్డు, బోయపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రతి పేదవాడికి నాడు ఇందిరమ్మ గూడు ఇచ్చింది కాంగ్రెస్ అని అన్నారు.
ఏదైనా వ్యాపారం చేసుకొని బతకడానికి లోన్స్ ఇచ్చింది కాంగ్రెస్ అన్నారు.
కానీ నేటి ప్రభుత్వం పేదోడి కడుపు మీద కొట్టి, ఉన్నోళ్ల కడుపు నింపుతుంది అని ఆయన మండిపడ్డారు. పచ్చని మహబూబ్ నగర్ లో నేడు కొందరు చిచ్చు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల కోసం యువత యేండ్ల తరబడి వేచి చూస్తూ నిరుద్యోగులు నేడు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. ఇదేనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్దేశ్యం అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

తాను అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇప్పించడమే కాదు, సంక్షేమ పథకాలను అందరికీ అందేవిధంగా భాధ్యత తీసుకొంటానని ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ పార్టీ, ఇది ప్రజల పార్టీ, బీద బడుగు బలహీన వర్గాల పార్టీ, మైనారిటీ వర్గాల పార్టీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, పట్టణ కార్యనిర్వహక అధ్యక్షులు ఆజ్మత్ అలి, కర్నాటక రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మోయిన్ అలి, ఉమ్మడి జిల్లా గౌడ్ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్ పి వెంకటేష్,, కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, మాజీ మార్కిట్ కమ్మిటి ఛైర్మెన్ అమరెందర్ రాజు,ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయి బాబా, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జె. చంద్రశేఖర్, బోయపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యదర్శి అబ్దుల్ హక్, మరియు బోయపల్లి కాంగ్రెస్ నాయకులు దేవేందర్ నాయక్ ,తాహెర్ , బెక్కరి మధుసూదన్ రెడ్డి, పట్టణ మాజీ మహిళ అధ్యక్షురాలు బెక్కరి అనిత, ఇటుక్ ఐ ఎన్ టి యు సి రాములు యాదవ్, లక్ష్మి నారాయణ గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News