Wednesday, February 26, 2025
Homeఆంధ్రప్రదేశ్Maha Shivaratri: మహాశివరాత్రి వేళ తీవ్ర విషాదం.. యువకులు గల్లంతు

Maha Shivaratri: మహాశివరాత్రి వేళ తీవ్ర విషాదం.. యువకులు గల్లంతు

మహా శివరాత్రి(Maha Shivaratri) వేడుకల వేళ తీవ్ర విషాదం నెలకొంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున నదీస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ దుర్ఘటన అందరినీ కలిచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా.. మిగిలిన మృతదేహాల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పండుగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో యువకుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గల్లంతైన వారిలో తిరుమలశెట్టి పవన్​(19), పడాల దుర్గాప్రసాద్​(17), అనిశెట్టి పవన్​(19), గర్రె ఆకాష్​(17), పడాల సాయి(19) ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News