Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి ఘటన పాపం చంద్రబాబుదే -వైఎస్ జగన్

తిరుపతి ఘటన పాపం చంద్రబాబుదే -వైఎస్ జగన్

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. ఇక క్షతగాత్రులను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి ఘటన పాపం ప్రభుత్వానిదే అంటూ విమర్శించారు. తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.

- Advertisement -

ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే వైఫల్యమని విమర్శించారు. వైకుంఠ ఏకాదశిని వైసీపీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లు గొప్పగా నిర్వహించామని తెలిపారు. ఒకచోటే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు.. విష్ణునివాసంలో ఒకరు చనిపోయారని FIR కాపీలో ఉంది.. బైరాగిపట్టెడలో ఐదుగురు చనిపోయారని FIRలో ఉందన్నారు.

స్విమ్స్‌ ఆసుపత్రిలో మొత్తం 35 మంది చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. మొత్తం 50 నుంచి 60 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది.. ఇంత దారుణంగా వ్యవస్థను నడుపుతున్నారని మండిపడ్డారు. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఎవరూ పట్టించుకోలేదని జగన్‌ ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పడూ జరగలేదని అన్నారు. ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. లక్షలాది మంది వస్తారని తెలిసినా భద్రత కల్పించలేదు.. టీటీడీ అధికారుల నుంచి ఎస్పీ, కలెక్టర్‌ అందరూ ఇందులో భాగస్వాములే అని జగన్ అన్నారు.

ప్రస్తుత పాలకులదే ఈ పాపం అంటూ జనగ్ విమర్శించారు. తప్పుచేసినా ఒప్పుకునే మనస్తత్వం చంద్రబాబుకు లేదన్నారు. అయనకు దేవుడంటే భయం లేదని.. ఈ ఘటనకు మొదటి ముద్దాయి ఆయనే అని విమర్శించారు. వైకుంఠ ద్వార దర్శనానికి లక్షలాదిగా జనం వస్తారని తెలిసి.. టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు సెక్యూరిటీ అరెంజ్ చేయలేదని జగన్ విమర్శించారు.

చంద్రబాబు ఆరు, ఏడు, ఎనిమిది తారీఖుల్లో చంద్రబాబు నాయుడు జిల్లాలోనే ఉన్నారని.. అప్పటి వరకూ పోలీస్ సెక్యూరిటీ అంతా అక్కడే ఉన్నారని తెలిపారు. చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి పోలీసులు అక్కడే ఉండిపోయారిని తెలిపారు. జనం అందరూ వచ్చిన తర్వాత ఒక్కసారిగా గేట్లు తెరిచారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేసిన తప్పేనని.. వారే బాధ్యత వహించాలని విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News