YS Jagan Allegations CM Chandrababu : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేస్తోందని, ఉద్యోగులను రోడ్ల మీద నిలబెట్టి వికృతానందం పొందుతోందని ఆరోపించారు. టీడీపీ నేతలు ‘పొలిటికల్ గవర్నెన్స్’ అంటూ ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: Chiranjeevi And Venkatesh: వెంకీమామ వీడియో షేర్ చేసిన ‘మన శంకరవరప్రసాద్ గారు’
కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలైనా 4 DA ఇన్‌స్టాల్‌మెంట్లు పెండింగ్‌లో పెట్టారని, ఉద్యోగులు రోడ్ల మీదికి దిగాక ఒక DA మాత్రమే ప్రకటించారని జగన్ తిడుకున్నారు. “ఇది పండుగ బహుమతి కాదు, ఉద్యోగులకు అవమానమే” అని చెప్పారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 5 ఏళ్లలో 11 DAలు ఇచ్చామని, 2019లో అధికారంలోకి వచ్చిన వారితో పోలిస్తే మా ప్రభుత్వం IR (ఇంటరిమ్ రిలీఫ్) ఇచ్చామని గుర్తు చేశారు. పెన్షనర్లకు DR (డియర్‌నెస్ రిలీఫ్) 2027 వరకు ఇస్తామని చెప్పడం మరో మోసమని విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, దాదాపు రూ.31 వేల కోట్ల బకాయిలు పెట్టారని జగన్ ఆరోపించారు. పోలీసుల సరెండర్ లీవ్‌లు 4 పెండింగ్‌లో పెట్టారని, “ఉద్యోగులకు ఏమి ఇచ్చారు? పండగ సంబరాలు చేసుకోవాలా?” అని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలకు ఉద్యోగులు మోసపోయారని, ఇప్పుడు రోడ్ల మీదికి దిగితే వికృతానందం పొందుతున్నారని ఆరోపణ చేశారు.
పెన్షన్ విషయంలో CPS (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి మెరుగైన సిస్టమ్ తెస్తామన్నారు కానీ, CPS రద్దు చేయలేదు, OPS (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) తీసుకురాలేదు, మా ప్రభుత్వం తెచ్చిన GPS (గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్) పక్కన పెట్టారని జగన్ వివరించారు. మా ప్రభుత్వం వేసిన PRC (పే రివిజన్ కమిషన్) కమిషన్‌ను పక్కన పెట్టి కొత్త కమిషన్ వేయలేదని తిడుకున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని, 3400 మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేశామని, మిగిలినవారి ప్రక్రియ పూర్తి చేశామని గుర్తు చేశారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వడం లేదని, వాలంటీర్ల జీతం రూ.5 వేల నుంచి 10 వేలకు పెంచుతామన్నారు కానీ, అధికారంలోకి రాగానే 2.65 లక్షల వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని జగన్ ఆరోపించారు. ఈ హామీలు ఇచ్చి మోసం చేయడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు కష్టాలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విమర్శలతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.


