Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: జగన్

YS Jagan: ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: జగన్

YS Jagan| రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యమక్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి దారుణాతిదారుణ పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలు అదుపుతప్పాయని.. అన్ని వ్యవస్థలను నీరుగార్చారని ఆరోపించారు.

- Advertisement -

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, హోంమంత్రి అనిత ఒత్తిడి మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు పనిచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెల్లో 91 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. స్వయాన సీఎం చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం అయిన హిందూపురంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగే పోలీసులు మూడు రోజులు కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కనీసం బాలయ్య.. బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గం అయిన అనకాపల్లిలో 9వ తరగతి బాలికను చంపేస్తే కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు.

టీడీపీ అధికార ఎక్స్ పేజీలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ‘నేను మా అమ్మను చంపడానికి ప్రయత్నించానని పోస్టులు పెట్టారు. అది అబద్ధమని విజయమ్మ లేఖ విడుదల చేశారు. అయినా అది ఫేక్ లెటర్ అని మరో పోస్టు పెట్టింది అని విమర్శించారు. మరి వారిపై కేసులు ఎందుకు పెట్టలేదు’ అని నిలదీశారు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ తప్ప వేరే పార్టీ లేదని.. మరి అలాంటప్పుడు తమను ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించార. ప్రతిపక్షంగా గుర్తించనప్పుడు అసెంబ్లీకి వెళ్లి లాభమేంటన్నారు.

ఇక ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు చేశారు. విద్యావ్యవస్థలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయని.. ఈ-క్రాప్ లేదన్నారు. టీటీడీ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే పథకాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే లక్షన్నర పింఛన్లు కట్ చేశారని జగన్ ఆగ్రహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News