వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. గుంటూరు మిర్చి యార్డ్‌కు చేరుకుని మిర్చి రైతులతో జగన్ మాట్లాడారు. గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయంపై వారితో మిర్చి రైతులతో మాట్లాడిన అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.
- Advertisement -

గుంటూరు మిర్చి యార్డ్ లో రైతులతో మాట్లాడిన జగన్ ను చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు స్థానికులు ఎగబడటంతో మిర్చి యార్డు ప్రాంతమంతా జనమయం అయింది.










