Thursday, February 27, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించిన జగన్

YS Jagan: పోసాని భార్యను ఫోన్‌లో పరామర్శించిన జగన్

పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఖండించారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని సతీమణి కుసుమలతను ఫోన్‌లో పరామర్శించారు. భయపడొద్దని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

- Advertisement -

కాగా పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీకి తరలించారు. ప్రస్తుతం కడపలోని ఓ రహస్య ప్రాంతంలో ఆయనను విచారించారు. కాసేపట్లో రాజంపేట కోర్టులో హాజరుపర్చనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News