YS Jagan Krishna Farmers Visit : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించారు. రామరాజు పాలెంలో మునిగిన పంటపొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను కలిసి, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు.
ALSO READ: Panchayat Secretaries: అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలు పొడిగింపు
మొంథా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయిన రైతులను మాజీ సీఎం వైఎస్ జగన్ కలిశారు. “ప్రభుత్వం ఇప్పటికీ పంట నష్టం అంచనా వేయలేదని, రైతుల పట్ల ప్రభుత్వం నిర్దయగా ప్రవర్తిస్తోంది” అంటూ మండిపడ్డారు. “కూటమి ప్రభుత్వం ఈ-క్రాప్ చేయడం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా అమలు చేయడం లేదు. అన్నదాత సుఖీభవ పేరుతో రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు” అని విమర్శించారు.
మొంథా తుఫాన్ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిందని, సుమారు 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టపోయిందని తెలిపారు. “ధాన్యం చేతికొచ్చే సమయంలో తుఫాన్ రావడంతో రైతులు తీవ్ర నష్టపోయారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు బీమా అందించి ఆదుకున్నాం. ఇప్పుడు ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్‌లో కొనాల్సిన పరిస్థితి వచ్చింది” అని అన్నారు.
జగన్ పర్యటనలో BC, SC, ST, మైనారిటీ రైతులు పాల్గొన్నారు. “రైతులు మా బలం, వారిని ఆదుకోవడం మా బాధ్యత” అని జగన్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.
తుఫాన్ వచ్చిన తర్వాత పేరుకు రైతులను పరామర్శించిన సీఎం చంద్రబాబు లండన్ వెళ్లారు, ఆయన కుమారుడు లోకేష్ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన క్రికెట్ మ్యాచ్‌కు ముంబై వెళ్లారు. ఈ సంఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి ఎదురవుతుంది. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని మొదట్లో చెప్పారు కానీ ఇప్పుడు నష్టం అంచనాలు తక్కువ చూపిస్తున్నారు అంటూ జగన్ ఫైర్ అయ్యారు.


