Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: కర్నూలులో పర్యటించిన మాజీ సీఎం జగన్

YS Jagan: కర్నూలులో పర్యటించిన మాజీ సీఎం జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) కర్నూలు జిల్లాలో పర్యటించారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలు చేరుకున్నారు. జీఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కన్వెన్షన్ సెంటర్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కర్నూలు నుంచి నేరుగా తాడేపల్లి వెళ్లారు. కాగా డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ పిలుపునిచ్చింది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News