Homeఆంధ్రప్రదేశ్YS Jagan: మరికాసేపట్లో పులివెందులకు బయలుదేరనున్న వైఎస్‌ జగన్‌

YS Jagan: మరికాసేపట్లో పులివెందులకు బయలుదేరనున్న వైఎస్‌ జగన్‌

YS Jagan Pulivendula tour: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరికాసేపట్లో పులివెందులకు బయలుదేరనున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి పులివెందులకు చేరుకుంటారు.

- Advertisement -

మూడు రోజుల షెడ్యూల్ ఖరారు: పులివెందుల పర్యటనలో భాగంగా జగన్‌ తన నియోజకవర్గ ప్రజలతో మమేకమవడంతో పాటు పలువురు పార్టీ నేతలను పరామర్శించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఏప్రిల్‌ 22న పులివెందుల నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి వెళ్తారు. ఇటీవల మరణించిన వైఎస్సార్‌సీపీ నేత సుధాకర్‌రెడ్డి నివాసానికి చేరుకుంటారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెబుతారు. ఆ తరువాత భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ‘ప్రజా దర్బార్’ నిర్వహిస్తారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.

Also read-Telangana: రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు వద్దు.. ఏపీ సీఎంకు మంత్రి పొన్నం లేఖ!

పులివెందులలో భారీ ఏర్పాట్లు: మాజీ సీఎం పర్యటన నేపథ్యంలో పులివెందులలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. మూడు రోజుల పాటు ఆయన స్థానిక నాయకులతో పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. దీంతో నియోజక వర్గంలో ప్రజల సమస్యలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. అనంతరం ఏప్రిల్‌ 23న పర్యటన ముగించుకుని.. బెంగుళూరుకు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News