Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: ఎన్టీఆర్‌ని మించి చంద్రబాబు నటిస్తున్నారు.. జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఎన్టీఆర్‌ని మించి చంద్రబాబు నటిస్తున్నారు.. జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan| కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.10లక్షల కోట్ల మేర అప్పులు చేశారంటూ చంద్రబాబు(Chandrababu) తమపై విష ప్రచారం చేశారని విమర్శించారు. దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ నటనకు మించి చంద్రబాబు నటిస్తున్నారని సెటైర్లు వేశారు. రూ.10లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించారని తెలిపారు. ఓ పద్ధతి ప్రకారం తమపై గోబెల్స్‌ ప్రచారం చేశారన్నారు..

- Advertisement -

2019లో టీడీపీ ప్రభుత్వం వైదొలిగే నాటికి రూ.3.13 లక్షల కోట్ల అప్పు ఉండగా.. 2024లో తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్ల అప్పు ఉందని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తమ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందరని తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు, ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం రూ.6 లక్షల కోట్లే అప్పులు చూపించారని ధ్వజమెత్తారు. అంటే చంద్రబాబు పాలనలో 19 శాతం అప్పులు పెరిగితే.. తన పాలనలో 15 శాతం మాత్రమే అప్పులు పెరిగాయని పేర్కొన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ పాటించినందుకు చంద్రబాబు తమకు అవార్డ్ ఇవ్వాలని జగన్ వెల్లడించారు.

ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) పథకాలను ఎగ్గొట్టేందుకే తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని ఆక్షేపించారు. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే సూపర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయించాల్సి వస్తుందని.. 5 నెలల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారని చెప్పుకొచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 4 నెలల సమయం ఉండగా.. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏంటని విమర్శించారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉందని తెలిపారు. రాష్ట్రం మరో శ్రీలంక కాబోతుందని అబద్ధాలు ప్రచారం చేశారని.. చంద్రబాబుకు వదినమ్మ పురందేశ్వరి, దత్తపుత్రుడు వత్తాసు పలికారని జగన్ దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News