Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jayanthi-Katasani tribute: వైఎస్ఆర్ కు ఘనంగా నివాళి

YS Jayanthi-Katasani tribute: వైఎస్ఆర్ కు ఘనంగా నివాళి

ఆంధ్రుల ఆరాధ్య దైవం వైఎస్ఆర్

ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాటసాని ఓబుల్ రెడ్డి. బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో మన మన అందరి నాయకుడు జనహృదయనేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కాటసాని ఓబుల్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

ముందుగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య కేక్ కట్ చేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాలింతలకు పండ్లు, బ్రెడ్ లు అందించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ అప్పటి ప్రియతమ ముఖ్యమంత్రి మన ఆంధ్రుల ఆరాధ్య దైవం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

ఆయన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మనలో లేకుండా నేటికీ 14 వసంతాలు అయినా కూడా ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయన పేదలకు దేవుడిలాగా ఆధ్యుడయ్యారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం 108 అంబులెన్స్ రైతులకు ఉచిత విద్యుత్తు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుల నిర్మాణము లాంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలే నేటికీ కూడా చిరస్థాయిగా గుర్తుండిపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి మహానీయుడు అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముందుకు వెళ్తారని ఆయన ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులకు అందేటట్లు క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేటట్లు ప్రభుత్వ నడుము కట్టిందని చెప్పారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన లాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పరిపాలన రామ రాజ్యంలా సాగుతుందని అందుకు ప్రజలే సాక్ష్యం అని చెప్పారు. 151 స్థానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రుణాన్ని ప్రజలు తీర్చుకోవడం జరిగిందని ఆ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుందని చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరో 10 సంవత్సరాల పాటు పరిపాలన సాగించి ఉంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హరితాంధ్రప్రదేశ్ గా మారేదని చెప్పారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కక్షలు కరపడినాలకు చరమగీతం పాడి కోనసీమ మాదిరిగా వ్యవసాయం పట్ల రైతులు ఆసక్తి చూపెట్టినట్లు సాగు నీరు పథకాలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. అలాంటి మహనీయుని కుమారుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలకు, కులాలకు, మతాలకు, అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క అర్హులైన పేదవానికి అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దీవెనమ్మ, బనగానపల్లి మండల జడ్పిటిసి సుబ్బ లక్ష్మమ్మ, బనగానపల్లె పట్టణ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ, భాను ముక్కల పరపతి సంఘం చైర్మన్ నీలి శ్రీనివాసులు, వైయస్సార్ పార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్ ,డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ ,ఈసారి ఎల్లయ్య, కిషోర్, జిల్లెల్ల శంకర్ రెడ్డి, మెట్టుపల్లి రమణ,నారాయణ, కార్పెంటర్ యూనియన్ సంఘం సభ్యులు, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News