Monday, June 2, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ఫెయిలైంది విద్యార్థులు కాదు.. ప్రభుత్వం: షర్మిల

YS Sharmila: ఫెయిలైంది విద్యార్థులు కాదు.. ప్రభుత్వం: షర్మిల

ఏపీ పదో తరగతి పరీక్షల మూల్యాంకనంలో తప్పులు దొర్లడంపై కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌(Nara Lokesh)పై విరుచుకుపడుతున్నాయి. విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ విఫలయ్యారని.. తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కూడా దీనిపై స్పందించారు. ఫెయిలైంది విద్యార్థులు కాదని.. ప్రభుత్వాలు అని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“10వ తరగతి పరీక్ష ఫలితాల రీ కౌంటింగ్ పై జగన్ , లోకేష్ గార్ల మధ్య వాదనలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వైసీపీ హయంలో ప్రతి ఏటా రీ కౌంటింగ్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో 20 శాతం మంది తిరిగి అధిక మార్కులతో పాస్ అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న 30 వేల మందిలో 11 వేల మందికి తిరిగి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయంటే, పేపర్ల మూల్యాంకనంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుంది. ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తుంది. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయ్యింది. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు అనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు.

వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదు. పేపర్లు సరిగ్గా దిద్దలేని వైసీపీ, కూటమి ప్రభుత్వాలే రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఫెయిల్. పిల్లల భవిష్యత్ ను నిర్ణయించడంలో ఫెయిల్ అయిన వీళ్ళు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారు ? చదువులతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటున్నారు. ధనదాహం మీద ఉన్న శ్రద్ధ విద్యావ్యవస్థను ఉద్ధరించడం మీద లేదు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 30 వేల మంది విద్యార్థులకు సంబంధించి 60 వేల పేపర్ల రీ కౌంటింగ్ కు వస్తే అందులో 11 వేల మందికి అత్యున్నత మార్కులు వచ్చాయంటే పూర్తిగా మీ ప్రభుత్వ వైఫల్యమే. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఫెయిల్ అయినట్లే. వెంటనే విచారణ చేయండి. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి పేపర్ మళ్ళీ రీ వెరిఫికేషన్ ఉచితంగా చేయండి.” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News