Friday, January 10, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: తొక్కిసలాట మృతులకు రూ.కోటి పరిహారం ప్రకటించాలి: షర్మిల

YS Sharmila: తొక్కిసలాట మృతులకు రూ.కోటి పరిహారం ప్రకటించాలి: షర్మిల

మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట.. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. ఈ ఘటనకు గల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయం.

ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలి. వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని APCC పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని షర్మిల డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News