Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: అసెంబ్లీకి రాకపోతే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

YS Sharmila: అసెంబ్లీకి రాకపోతే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

YS Sharmila| ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం వైసీపీ అధినేత జగన్‌(YS Jagan) అహంకారం, అజ్ఞానానికి నిదర్శనమని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

“మిమ్మల్ని గెలిపించింది ప్రజలు. మీకు బాధ్యత లేదా ?. ప్రతిపక్ష హోదా లేకపోతే మైకూ ఇవ్వరట. మైకు ఇవ్వకపోవడం మీ స్వయం కృతాపారథం. ఒకప్పుడు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? మీ అక్రమాలను,అవినీతిని ప్రజలు గమనించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలి కదా. అసెంబ్లీ పోను అనడం అహకారానికి నిదర్శనం. జగన్ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఇంట్లో కూర్చోవడానికి కాదు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. మీకు అసెంబ్లీకి వెల్లే ధైర్యం, సామర్థ్యం లేకుంటే రాజీనామా చేయండి” అని ఆమె డిమాండ్ చేశారు.

ఇక కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. “ఇది ప్రజల బడ్జెట్ కాదు. ఇది మోసపూరిత బడ్జెట్. ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిన బడ్జెట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్యాయం చేసిన బడ్జెట్. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ చెప్పారు. బడ్జెట్‌ అంటే స్పష్టత ఉండాలి.. కేటాయింపులు ఉండాలి.. కానీ ఈ బడ్జెట్‌లో స్పష్టత లేదు.. కేటాయింపులు లేవు. ఇది కేటాయింపులు లేని బడ్జెట్. ఇది బడ్జెట్‌నో… మ్యానిఫెస్టోనో ప్రజలకు క్లారిటీ లేదు. ఇది మరో ఎన్నికల మ్యానిఫెస్టోలా ఉంది.” అంటూ షర్మిల విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News