HomeTop StoriesYS Sharmila: రాహుల్‌తో షర్మిల భేటీ.. కర్ణాటక నుంచి రాజ్యసభకు లైన్‌ క్లియర్‌?

YS Sharmila: రాహుల్‌తో షర్మిల భేటీ.. కర్ణాటక నుంచి రాజ్యసభకు లైన్‌ క్లియర్‌?

YS Sharmila meeting with Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతో నేటి మధ్యాహ్నం (శుక్రవారం) ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. దిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సైతం పాల్గొన్నారు. షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి పెద్దల సభలకు వెళ్లాలని షర్మిల భావిస్తోంది. ఈ క్రమంలోనే షర్మిల రాహుల్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఆమె అభ్యర్థనపై రాహుల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ అంశంలో రాహుల్‌ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, మీటింగ్‌ అనంతరం ఏపీలో కాంగ్రెస్‌ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై రాహుల్‌గాంధీ పలు సూచనలు చేసినట్లు షర్మిల ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. అయితే, రాజ్యసభ సీటు గురించి తన పోస్టులో ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

- Advertisement -

Also read: NEET paper leak: నీట్‌ పేపర్‌ లీకేజీపై సుప్రీంలో అఫిడవిట్‌.. పారదర్శకంగా నిర్వహిస్తామన్న ఎన్‌టీఏ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News