Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ప్రియాంక గాంధీ గెలుపుపై వైఎస్ షర్మిల ఏమన్నారంటే..?

YS Sharmila: ప్రియాంక గాంధీ గెలుపుపై వైఎస్ షర్మిల ఏమన్నారంటే..?

YS Sharmila| కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక(Wayanad by-elections)లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు 4లక్షలకు పైగా భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ మంత్రులు, నేతలు, కార్యకర్తలు ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

తాజాగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టు పెట్టారు. వయనాడ్ ఉప ఎన్నికలో అద్భుత విజయం సాధించిన ప్రియాంక గాంధీకి అభినందనలు తెలిపారు. భారత రాజ్యాంగ విలువలకు మద్దతుగా ప్రజల గొంతును ఆమె లోక్ సభలో బలంగా వినిపిస్తారని ఆకాంక్షించారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు(V Hanumantha Rao) కూడా స్పందించారు. వయనాడ్‌ ప్రజలు ప్రియాంక గాంధీని అద్భుతంగా ఆదరించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆమె చరిత్ర సృష్టించారని కొనియాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad