Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: అదానీతో జగన్ ఒప్పందంపై కేంద్రానికి షర్మిల సంచలన లేఖ

YS Sharmila: అదానీతో జగన్ ఒప్పందంపై కేంద్రానికి షర్మిల సంచలన లేఖ

YS Sharmila| ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీతో గత వైసీపీ ప్రభుత్వం చేసుకున్న సౌర విద్యుత్ ఒప్పందంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ERC)కు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల సంచలన లేఖ రాశారు.అదానీ గ్రూప్ కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నందున ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందాల వ్యవహాలంలో అదానీ ద్వారా అప్పటి సీఎం జగన్‌కు రూ. 1750 కోట్లు ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థ నిర్ధారించిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందాల వల్ల ప్రజలపై వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. కేంద్రానికి లేఖ రాసినట్లు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“జగన్ మోహన్ రెడ్డి గారు అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో రూ. 1750 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్టు అమెరికా దర్యాప్తు సంస్థ చెప్తోంది. జగన్ గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా తెలివిగా మాట్లాడుతున్నారు. 2021లో అప్పటి సీఎం అంటే జగన్ కాక మరెవరు..? జగన్ వ్యాఖ్యలు చూసి వెర్రి తనం అనుకుంటున్నారు జనం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళన చేసింది. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? ఎందుకు మౌనంగా ఉన్నారు ? అదానీకి చంద్రబాబు భయపడుతున్నారా..? అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఒప్పందం రద్దులో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు..? లాంగ్ టర్మ్ డీల్ చేయకూడదని తెలిసినా జగన్ ఎందుకు అమలు చేశారు..? జగన్, అదానీ మధ్య ఒప్పందం ఎందుకు రద్దు చేయరు..? చంద్రబాబు‌కు కూడా ఏమైనా డబ్బులు అందాయా..? చంద్రబాబు ఒప్పందాలను జగన్ చాలా తేలిగ్గా రద్దు చేశారు. జగన్ ఒప్పందాలను చంద్రబాబు ఎందుకు రద్దు చేయడం లేదు..? ఈనెల నుంచే ఈ విద్యుత్ భారాలు ప్రజలపై మోపారు. అక్రమాలన్ని స్పష్టంగా తెలిసినా చంద్రబాబు స్పందించరా..? ఈ ఒప్పందాలు రద్దు చేయాలని చంద్రబాబుని‌ డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం జోక్యం చేసుకుని అదానీ, జగన్ మధ్య ఒప్పందాలు రద్దు‌చేయాలి. ఈ మేరకు సెంట్రల్ ERCకి లేఖ రాస్తున్నాం. దీనిపై పునఃపరిశీలన చేయాలని కోరుతున్నాం” అని షర్మిల డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News