Monday, November 4, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Vijayamma: జగన్‌కు విజయమ్మ సపోర్ట్.. ఎందుకంటే..?

YS Vijayamma: జగన్‌కు విజయమ్మ సపోర్ట్.. ఎందుకంటే..?

YS Vijayamma| ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ(YS Vijayamma) హత్యకు కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై విజయమ్మ స్పందించి బహిరంగ లేఖ రాసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. కొంతమంది లేనిపోని అసత్య కథనాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారం తనను ఎంతగానే కలచివేసిందని లేఖలో పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే తనకు తీవ్ర మానసిక వేదన కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను అడ్డం పెట్టుకుని నీచ, నికృష్ట రాజకీయలకు చేస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

ఇలాంటి రాజకీయాలను తాను ఖండించకపోతే ప్రజలు నిజం అనుకునే ప్రమాదం ఉందన్నారు. వాస్తవాలతో పాటు కొంతమంది దుర్మార్గపు ఉద్దేశాలు ప్రజలకు తెలియాలని స్వయంగా తానే స్పందించానని తెలిపారు. తన కారుకు ఎప్పుడో జరిగిన ప్రమాదాన్ని తన కుమారుడు వైఎస్ జగన్‌(YS Jagan)పై పెట్టి దుష్ర్పచారం చేయడం అత్యంత జుగుప్సాకరమని ధ్వజమెత్తారు. రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న తన మనవడి దగ్గరకు వెళితే దాన్ని సైతం తప్పుగా చిత్రకరించారని.. తాను భయపడి విదేశాలకు పారిపోయినట్లు దుష్ప్రచారం చేయడం అత్యంత నీతి మాలిన చర్య అని ఫైర్ అయ్యారు. ఇకపై ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

కాగా ఇటీవల వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ అమెరికా పర్యటన నుంచి తెలుగుదేశం పార్టీ(TDP) సంచలన ట్వీట్ చేసిన విషయం విధితమే. ఎన్నికల ముందు విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారు..? ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ ఎందుకు వచ్చారు..? అనే ప్రశ్నలు లేవనెత్తింది. 2019 ఎన్నికలకు బాబాయ్‌‌ని లేపేసినట్టే… 2024 ఎన్నికలకు మరో పెద్ద తలకాయను జగన్ టార్గెట్ చేస్తాడేమో అని ప్రజలు అనుకుంటున్న సమయంలో ఇది జరిగిందని పేర్కొంది. ఆ తర్వాత ఏడాది పాటు విజయ రాజశేఖర్ రెడ్డి గారు అమెరికాలోనే ఉన్నారని.. ఈ లోగుట్టు ఆ కుటుంబానికే తెలుసు అని చెప్పుకొచ్చింది.

కాగా ఎన్నికలకు ముందు విజయమ్మ.. హైదరాబాద్ నుంచి కొత్త కారులో కర్నూలులో జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో అత్యంత భద్రత ఉండే సీఎం తల్లి ప్రయాణిస్తున్న కారులో రెండు టైర్లు ఒకేసారి ఎలా పేలతాయనే అనుమానాలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి ఈ ప్రచారం జరుగుతూనే ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News