Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Viveka Murder Counter Petition : వివేకా హత్య కేసులో కౌంటర్ పిటిషన్ – ఆ...

Viveka Murder Counter Petition : వివేకా హత్య కేసులో కౌంటర్ పిటిషన్ – ఆ 6 ప్రశ్నలతో సీబీఐకి సవాల్!

Viveka Murder Counter Petition : మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో (A2) సునీల్ యాదవ్, నాంపల్లి CBI కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. CBI దర్యాప్తు వైఖరిపై పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. కేసులో ఇంకా అనేక అంశాలు వెలుగులోకి రావాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

సునీల్ యాదవ్ పిటిషన్‌లో కొన్ని ప్రధాన ప్రశ్నలు లేవనెత్తారు. “ఈ కేసులో అప్రూవర్ దస్తగిరి రెడ్డిని కడప జైల్లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించిన ఘటనపై CBI ఎందుకు విచారణ జరపలేదు? 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనుక అవినాష్ రెడ్డి కుట్ర కోణం ఉందని ఆరోపణలు వచ్చాయి. దానిపై ఎందుకు దర్యాప్తు చేయలేదు?” అని ప్రశ్నించారు.

అదేవిధంగా, కేసులో ఆరుగురు కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారని, ఆ మరణాలపై CBI ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని నిలదీశారు. కల్లూరు గంగాధర్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని అనంతపురం SPకి ఫిర్యాదు చేసిన తర్వాత, అధికారులు ఎందుకు రక్షణ కల్పించలేదని అడిగారు.

సునీల్ యాదవ్ పిటిషన్‌లో మరిన్ని ప్రశ్నలు – “కేసులో తప్పు చేయలేదని చెబుతున్న మిగిలిన నిందితులు దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు? దర్యాప్తుపై ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు?” అని ప్రశ్నలు లేవనెత్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad