ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున… వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు– ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన– 2023, జారీ చేసినవారు– జి.వి.డి.కృష్ణమోహన్, కమ్యూనికేషన్స్ ఎడ్వైజర్.
వరసగా మూడో సంవత్సరం, రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అవార్డుల్ని కమిటీ ప్రకటిస్తోంది. కమిటీలో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీ దేవులపల్లి అమర్, జి.వి.డి.కృష్ణమోహన్‌తో పాటు– ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శ్రీ ముత్యాల రాజు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ శ్రీ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీలు సభ్యులు!
– ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాలనుంచి లబ్ధ ప్రతిష్ఠుల్ని దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులకు కమిటీ మూడేళ్ళుగా ఎంపిక చేస్తోంది!
– తమకు తాముగా దరఖాస్తు చేసుకున్న వారిని, జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ద్వారా ఎంపిక చేసిన నామినేషన్లను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాత ఈ ఎంపిక చేయటం జరిగింది.
– ఈ ఏడాది 27 అవార్డుల్ని సిఫారసు చేసి, ముఖ్యమంత్రిగారి ఆమోదం మేరకు కమిటీ ఈ ప్రకటన చేస్తోంది!
–ఈ రోజు ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైయస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు; 4 ఎచీవ్‌మెంట్ అవార్డులు!
– 2023లో వైయస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపిక అయిన వారు– వారి జిల్లాల జాబితా:
వ్యవసాయం:
1) శ్రీమతి పంగి వినీత– (ఎచీవ్‌మెంట్ అవార్డు)
2) శ్రీ వై.వి.మల్లారెడ్డి– అనంతపురం
ఆర్ట్ అండ్ కల్చర్:
1) శ్రీ యడ్ల గోపాలరావు– రంగస్థల కళాకారుడు– శ్రీకాకుళం
2) శ్రీ తలిసెట్టి మోహన్– కలంకారీ– తిరుపతి
3) శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి– హరికథ– బాపట్ల
4) శ్రీ కోన సన్యాసి– తప్పెటగుళ్ళు– శ్రీకాకుళం జిల్లా
5) ఉప్పాడ హ్యాండ్ లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ– కాకినాడ
6) శ్రీ ఎస్.వి.రామారావు– చిత్రకారుడు– కృష్ణా
7) శ్రీమతి రావు బాల సరస్వతి– నేపథ్య గాయని– నెల్లూరు
8) శ్రీ తల్లావఝుల శివాజీ– చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు– ప్రకాశం
9) శ్రీ చింగిచెర్ల కృష్ణారెడ్డి– జానపద కళలు– అనంతపురం
10) శ్రీమతి కలీసాహెబీ మహబూబ్– షేక్ మహబూబ్ సుబానీ దంపతులకు– నాదస్వరం– ప్రకాశం
తెలుగు భాష– సాహిత్యం:
1) శ్రీ ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం– పశ్చిమ గోదావరి
2) శ్రీ ఖదీర్ బాబు– నెల్లూరు– (ఎచీవ్‌మెంట్ అవార్డు)
3) శ్రీమతి మహెజబీన్– నెల్లూరు (ఎచీవ్‌మెంట్ అవార్డు)
4) నామిని సుబ్రహ్మణ్యం నాయుడు– చిత్తూరు
5) అట్టాడ అప్పలనాయుడు– శ్రీకాకుళం
క్రీడలు:
1) శ్రీ పుల్లెల గోపీచంద్– గుంటూరు
2) శ్రీమతి కరణం మల్లీశ్వరి– శ్రీకాకుళం
వైద్యం:
1) శ్రీ ఇండ్ల రామ సుబ్బారెడ్డి–మానసిక వైద్యం– ఎన్టీఆర్
2) ఈసీ వినయ్‌కుమార్‌రెడ్డి–ఈఎన్‌టీ– కాక్లియర్ ఇంప్లాంట్స్– వైయస్సార్
మీడియా:
1) శ్రీ గోవిందరాజు చక్రధర్– కృష్ణా
2) శ్రీ హెచ్చార్కే– కర్నూలు
సమాజ సేవ:
1) శ్రీ బెజవాడ విల్సన్– ఎన్టీఆర్
2) శ్రీ శ్యాం మోహన్– అంబేద్కర్ కోనసీమ– (ఎచీవ్‌మెంట్)
3) నిర్మల హృదయ్ భవన్– ఎన్టీఆర్
4 శ్రీ జి. సమరం– ఎన్టీఆర్