తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేతన్న హస్తం 5వ విడత వైఎస్ఆర్ నేతన్న నేస్తం నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. అనంతరం విశ్వోదయ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్ద బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్సార్ నేతన్ననేస్తం పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం నగదు జమ చేశారు. ఆ తర్వాత వెంకటగిరి త్రిభువన్ సెంటర్‌లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్ధనరెడ్డి విగ్రహాన్ని సీఎం వైయస్. జగన్ ఆవిష్కరించారు.










