Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్YSR Yantra Sayam: 58 ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

YSR Yantra Sayam: 58 ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

పంట ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ రైతు భరోసా, డాక్టర్ వైయస్సార్ యంత్ర సేవ పథకాల అమలు

బనగానపల్లె మండలంలో డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సాయం పథకం కింద సుమారు 78 ఆర్బికేలకు 58 ట్రాక్టర్లను శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, గౌరవ జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి, ఏపీ మైనర్ ఇరిగేషన్ చైర్మన్ గిరిజ హర్షవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా 2023-24 కి సంబంధించి పంట ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ రైతు భరోసా, డాక్టర్ వైయస్సార్ యంత్ర సేవ సుమారు 27 కోట్ల రూపాయల చెక్కును రైతు సోదరులకు పంపిణీ చేశారు.

- Advertisement -

నియోజకవర్గ స్థాయిలో 58 ట్రాక్టర్ లను లాంచనగా జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ మోహన్ రావు, కర్నూలు ఏడిఏ రాజశేఖర్, కోవెలకుంట్ల ఏడిఏ శ్రీకృష్ణమోహన్ రెడ్డి, ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, ఐదు మండలాల గ్రామ వ్యవసాయ సహాయకులు, ఐదు మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News