వైఎస్సార్ యంత్ర సేవ పథకంలో భాగంగా రైతులకు ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లుతో పాటు రాయితీ మొత్తాన్ని రైతు సంఘాల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని గుంటూరు చుట్టగుంట నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టగా.. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో స్థానికంగా కాటసాని నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, కర్నూలు నగరం నుండి వైఎస్సార్ యంత్ర సేవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని వీక్షిస్తున్న కర్నూలు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బివై. రామయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు, రాయితీకి సంబందించిన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో… కర్నూలు నగర మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వరరెడ్డి, అగ్రికల్చర్ జిల్లా అధికారులు, లబ్ధిదారులు రైతులు పాల్గొన్నారు..