Ysrcp Chief Ys Jagan Response To Cbi Court Order To Appear In Person: అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. నవంబర్ 21లోపు వ్యక్తిగా హాజరవుతానని కోర్టుకు తెలిపారు. యూరప్ పర్యటనకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. అయితే, హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో, జగన్ తన అభ్యర్థనను వెనక్కితీసుకుని, వారం రోజుల సమయం కోరారు. దీంతో, సీబీఐ కోర్టు జగన్ అభ్యర్థనను అంగీకరించి, నవంబరు 21 వరకు మినహాయింపు ఇచ్చింది. కాగా, యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. తాను కోర్టుకు హాజరు కావాలంటే ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని వాదించారు. ఈ అభ్యర్థనపై సీబీఐ మంగళవారం కౌంటర్ దాఖలు చేసింది. “వ్యక్తిగత హాజరు తప్పనిసరి. మినహాయింపు ఇవ్వలేం” అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో కోర్టులో ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది.
Read Also: https://teluguprabha.net/gallery/hair-fall-in-winter-follow-these-tips/
లండన్ పర్యటన వివరాలు తెలియజేయాలి..
మరోవైపు, ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు కొన్ని షరతులు విధించింది. పర్యటన వివరాలు తెలియజేయటంతో పాటుగా ఫోన్ నంబరు, ఈ-మెయిల్ వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అయితే, జగన్ లండన్ పర్యటన సమయంలో సొంత ఫోన్ నంబర్ ఇవ్వలేదంటూ సీబీఐ ఇటీవల కోర్టులో పిటిషన్ వేసింది. జగన్ ఇచ్చిన ఫోన్ నంబర్ పనిచేయలేదని.. మూడుసార్లు ఫోన్ చేసినా పనిచేయలేదని పిటిషన్ దాఖలు వేసింది. ఉద్దేశపూర్వకంగానే జగన్ పని చేయని ఫోన్ నంబర్ ఇచ్చారని, ఇది బెయిల్ నిబంధనలు ఉల్లంఘించడం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. వైఎస్ జగన్ విదేశీ పర్యటనలకు అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే, వైఎస్ జగన్ అసలు ఫోన్ వాడరని ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన తరుఫు న్యాయవాదులు వాదించారు. జగన్ తన సిబ్బంది ఫోన్ నంబర్లు ఇస్తారని.. గతంలోనూ ఇలాగే ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలను విన్న సీబీఐ కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.


