Homeఆంధ్రప్రదేశ్YSRCP MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ రిజెక్ట్‌

YSRCP MLC Ananthababu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు.. బెయిల్‌ పిటిషన్‌ రిజెక్ట్‌

YSRCP MLC Ananthababu Bail Petition rejects: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్‌ షాక్‌ తగిలింది. రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ రిజెక్ట్‌ అయ్యింది. అనంతబాబుపై గతంలో నమోదైన.. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలన్న అనంతబాబు అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. కాగా, డ్రైవర్‌ వీధి సుబ్రమణ్యం హత్యకేసులో నలుగురు సాక్షులను అనంతబాబు ప్రలోభపెట్టారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఏప్రిల్‌ 24న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం, రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఆయన రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు.

- Advertisement -

Also read: Honda City facelift: హోండా నుంచి మరో బడ్జెట్‌ కారు.. ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే గురూ..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News