Homeఆంధ్రప్రదేశ్YSRCP: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం

YSRCP: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సన్నద్ధం

★ గుడిబండలో విస్తృత స్థాయి సమావేశం

- Advertisement -

గుడిబండ, (తెలుగు ప్రభ):గుడిబండ మండల కేంద్రంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీ పరిస్థితులను అంచనా వేసి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు తగిన అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు చర్చించారు.

పార్టీ శ్రేణులందరూ ఐక్యంగా పనిచేస్తూ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ శివకుమార్, మాజీ సర్పంచ్ కరుణాకర్, మండల కన్వీనర్ డి.ఎల్. గౌడ్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు బి.హెచ్. రాయుడుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News