Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్YCP Twitter Account : అధికార వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

YCP Twitter Account : అధికార వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. గత అర్థరాత్రి అకౌంట్ హ్యాకైనట్లు తెలుస్తోంది. హ్యాకర్లు పార్టీ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ పిక్ ను మార్చేశారు. ఆ తర్వాత బయోడేటా వివరాలను మార్చేశారు. ఖాతా పేరును మాత్రం మార్చలేదు. ఆపై ఇందులో క్రిప్టో కమ్యూనిటీ పోస్టులు పెట్టారు. పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని పోస్టులు వెలువడ్డాయి.

- Advertisement -

పార్టీకి ఏ మాత్రం సంబంధంలేని క్రిప్టోకు సంబంధించిన పలు ట్వీట్లు పార్టీ ఖాతాలో ప్రత్యక్షమయ్యాయి. పార్టీ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు.. క్రిప్టోకు సంబంధించిన సమాచారాన్ని రీ ట్వీట్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ ఎన్‌ఎఫ్‌టీలు ఫ్రీగా ఇస్తున్నారని రీ ట్వీట్ చేశారు. ఖాతా బయోను మాత్రం ఎన్ ఎఫ్టీ మిలియనీర్, అమెరికా అని మార్చేశారు. కాగా.. గతంలో తెలుగు దేశం పార్టీకి చెందిన ఖాతాను రెండుసార్లు హ్యాక్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News