Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: జగన్ ఫిట్టింగ్, కటింగ్ మాస్టర్: లోకేష్

Yuvagalam: జగన్ ఫిట్టింగ్, కటింగ్ మాస్టర్: లోకేష్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిట్టింగ్, కటింగ్ మాస్టర్ అని, సంక్షేమ పథకం ఇచ్చినట్లు ఇచ్చి ఏదో ఒక సాకుతో ఫిట్టింగ్ పెట్టి సంక్షేమ పథకాన్ని కట్ చేస్తారని జాతీయ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్ర పాములపాడు మండలంలో కొనసాగింది. పాములపాడులో ఏర్పాటు చేసిన ఎస్సీల ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ దళితుల ద్రోహి అని, దళితులకు సంబంధించిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రభుత్వాలు మారిన వ్యవస్థ మారదని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. దళితుల కోసం తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఐదేళ్లలో 40 వేల కోట్లు ఖర్చు చేశామని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు జెసిబి లు, ఇన్నోవాలు, ట్రాక్టర్లు, కార్లు ఇచ్చి వారి అభ్యున్నతికి చంద్రబాబు కృషి చేశారని పేర్కొన్నారు. అలాగే ఎస్సీలకు 3000 ఎకరాల భూమినికేటాయించమన్నారు. నిరుద్యోగుల కోసం మెగాడియేషన్ తీసుకొస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్ నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్న ఇంతవరకు మెగా డీఎస్సీని ప్రకటించలేదన్నారు. గత ప్రభుత్వ హాయంలో విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటుచేసి విద్యార్థులు ఎదుగుదలకు కృషి చేసిన ఘనత చంద్రబాబు అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల పింఛన్లను తీసివేశారని, పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచుకుంటూ పోయారని, ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారని, ఎనిమిది సార్లు కరెంటు చార్జీలను పెంచిన ఘనత జగన్ దే అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు ఉపయోగించారని, దళిత బడులను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ, దళితులకు అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ఎస్సీలపై దాడులు చేస్తూ, ఎస్సీ ఉద్యోగస్తులను చంపేస్తున్న సర్కారుకు పట్టడం లేదని, దళితులను చంపి డోర్ డెలివరీ ఎమ్మెల్సీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చేది తెలుగుదేశ ప్రభుత్వం అని ప్రజలందరికీ మేలు చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు నారా లోకేష్. ఈ కార్యక్రమంలో మాండ్ర శివానందరెడ్డి, బండి జయరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News