Wednesday, July 16, 2025
HomeAP జిల్లా వార్తలుMaoist militants: లొంగిపోయిన 64 మంది మావోయిస్టు దళ సభ్యులు..

Maoist militants: లొంగిపోయిన 64 మంది మావోయిస్టు దళ సభ్యులు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయుత(Operation Cheyutha) కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 64 మంది మావోయిస్టు దళ సభ్యులు( Maoist militants surrender)లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లాల సభ్యులు.

- Advertisement -

మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకి, గత మూడు నెలల్లో 122 మంది మావోయిస్టు సభ్యులు లొంగొపోయారు. అజ్ఞాతాన్ని వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి అని ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామని ఐజీపి చంద్రశేఖర్ తెలిపారు.

వీరిలో 16 మంది మహిళలు, 64 మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఒకరు ఏసీఎం మెంబర్ ఉన్నారు. లొంగిపోయిన 64 మందికి 25వేల నగదు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News