రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సర్కారు ‘అడవితల్లి బాట’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ప్రారంభించనున్నారు. అల్లూరి, విశాఖ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, మరియు జనసేన MLA లు, నాయకులు, కార్యర్తలు పవన్ కళ్యాణ్ కి సాదర స్వాగతం పలికారు.
రోడ్డు మార్గాన మన్యం జిల్లా అరకు బయలు దేరి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దుంబ్రిగూడ ఆశ్రమ పాఠశాలలో బహిరంగ సభలో పాల్గొంటారు.
ఉదయం 11 గం.కి: దుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామ సందర్శన చేస్తారు. ‘అడవితల్లి బాట’ కార్యక్రమంలో పలు రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. 2 రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. గిరిజన గ్రామాల అనుసంధానం, రోడ్ల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధిపై ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.