HomeTop StoriesAmaravati: లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయండి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం

Amaravati: లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయండి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలకు వస్తున్న వరద ప్రవాహాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఏపీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజికి 25,375 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ప్రస్తుతం, నల్లమడ డ్రెయిన్ కు 47 వేల క్యూసెక్కులు, ఎర్ర కాలువకు 19,756 క్యూసెక్కుల మేర వరద ప్రవాహం ఉంది. తమ్మిలేరు, గోనెల వాగుకు 5,500 క్యూసెక్కులు, పెద్ద వాగుకు 9,500 క్యూసెక్కుల మేర వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. పొంగిపొర్లుతున్న వాగుల కారణంగా వివిధ రహదారి మార్గాల్లో రాకపోకలపై జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News