అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించిన వేళ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగపూరితంగా స్పందించారు. రాజధానికి భూములను అర్పించిన వేలాది మంది రైతులకు శిరసు వంచి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం 34,000 ఎకరాల భూమిని 29 వేలకుపైగా రైతులు సమర్పించిన త్యాగాన్ని ఆయన గుర్తు చేశారు. “ఐదేళ్లుగా రైతులు భయంకరమైన బాధలు అనుభవించారన్నారు.
ఆవేదనలో రోడ్లపైకి వచ్చారని. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారని. కేసుల పాలయ్యాలయ్యారని పేర్కొన్నారు. దివ్యాంగులు, మహిళలు, విద్యార్థులపై కూడా దాడులు జరిగాయి. రెండు వేలమందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని.. ఇది బాధాకరం. ఈ బాధను మర్చిపోలేము అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అమరావతి రాజధానిగా ఉండాలన్న ప్రజల ఆకాంక్షను బలపరిచేలా ఇప్పుడు చర్యలు ప్రారంభమయ్యాయని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఈ అంశం తెలుసు. ఆయన అమరావతిని శాశ్వత రాజధానిగా భావిస్తున్నారు. మేమిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ప్రధాని చేతుల మీదుగా రాజధాని నిర్మాణం తిరిగి మొదలవుతోంది. ఇది ఐదు కోట్ల ప్రజల ఆశయాలకు నిదర్శనం అని పవన్ అన్నారు. ఇక ముందు ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చెందకుండా అడ్డుకుందని విమర్శించిన పవన్ కళ్యాణ్.. కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వాలని కోరినా నిర్లక్ష్యం కనబర్చిందన్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలున్నాయి. అందుకే వేగంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతామని.. 20 ఏళ్ల ముందే అభివృద్ధి దిశలో ప్రణాళిక వేసిన చంద్రబాబునాయుడు నాయకత్వం మరోసారి రాష్ట్రాన్ని విజయపథంలో నడిపించుతుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.