Saturday, May 24, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిఅమరావతి ప్రజలకలలు నిజమవుతున్నాయి: సీఎం చంద్రబాబు

అమరావతి ప్రజలకలలు నిజమవుతున్నాయి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధికి శంకుస్థాపన చేసిన వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.. నేడు అమరావతి పునర్నిర్మాణానికి తొలి అడుగు పడుతోందని. ఇది తనతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుంచుకోదగిన చారిత్రాత్మక రోజని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మోడీతో ఇటీవల జరిగిన సమావేశాన్ని గుర్తు చేసిన సీఎం మునుపటి భేటీల్లో మోదీ ఎంతో ఉల్లాసంగా ఉండేవారు. కానీ ఇటీవల అమరావతికి ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు ఆయన ముఖంలో తీవ్రత, బాధ కనిపించింది. దేశంలో ఉగ్రవాద దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన కలత చెందారన్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కేంద్రం తీసుకునే ప్రతి చర్యకు రాష్ట్రం మద్దతుగా నిలుస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.

- Advertisement -

అమరావతిని మూడు సంవత్సరాల్లో నిర్మిస్తాం అని హామీ ఇచ్చిన చంద్రబాబు, ప్రస్తుత అభివృద్ధి ప్రణాళికల కింద రూ.57,980 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. మోదీ మార్గదర్శకత్వంలో అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని వివరించారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆశల రాజధాని. భవిష్యత్తులో 5 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోగల అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇది దేశంలోనే గొప్ప విద్యా, ఆరోగ్య కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

అమరావతిని పర్యావరణపరంగా సమతుల్యంగా, ఆధునిక సాంకేతికతతో తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతిలో స్థిరపడేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రక్రియను రాష్ట్రం పూర్తి స్థాయిలో స్వీకరిస్తుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేసి ఎన్డీయే అభూతపూర్వ విజయాన్ని సాధించింది. కేంద్రం ఇచ్చిన మద్దతుతో అభివృద్ధికి వేగం పెరుగుతుందని పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సమర్పించిన రైతులను ఆయన ప్రస్తావిస్తూ.. వాళ్ల త్యాగాల వల్లే ఈ రోజు సాధ్యమైంది. అమరావతి ఉద్యమం ఒక చారిత్రాత్మక ఉద్యమంగా నిలిచిపోతుందన్నారు. ఇది రైతుల ధైర్యానికి నిలువెత్తు ఉదాహరణ అని సీఎం చంద్రబాబు భావోద్వేగంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News