Cabinet meeting:రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఈరోజు ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో దాదాపు 20కి పైగా కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అమరావతికి రూ.904 కోట్ల నిధులు
అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. సీఆర్‌డీఏ సమావేశంలో చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.904 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇది అమరావతి రైతులు, ప్రజలకు ఒక శుభవార్తగా చెప్పవచ్చు.
Tdp-Janasena War: టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై..!
కీలకమైన నిర్ణయాలు, సంస్కరణలు
ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి, పర్యావరణ పరిరక్షణకు కొత్త విధానాలు రూపొందించనున్నారు.అధికార భాషా కమిషన్: అధికారిక భాషా కమిషన్ పేరును ‘మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్’గా మార్చడానికి ఆమోదం తెలపనున్నారు.వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి సంబంధించిన నాలా చట్టసవరణలకు ఆమోద ముద్ర వేయనున్నారు.గ్రామ, వార్డు సచివాలయాల్లో ఔట్‌సోర్సింగ్, డిప్యుటేషన్ పద్ధతిలో 2,778 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.మద్యం ధరలు, విదేశీ బ్రాండ్ల టెండర్లపై కేబినెట్ కమిటీ సిఫార్సులను పరిశీలించనుంది.చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు. అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాడు సాకేత్‌కు స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం కల్పించనున్నారు.
ఈ నిర్ణయాలతో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు అంశాలపై దృష్టి సారించిందని స్పష్టమవుతోంది. ఈ నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


